Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nuvvu Leni Nannu

నువ్వు లేని నన్ను

Nuvvu Leni Nannu

Verse
నువ్వు లేని నన్ను ఊహించలేను
నీ ఉన్నత ప్రేమను వివరించలేను‖ 2x ‖
అడగాలని నేను అనుకోకముందే
నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు‖ 2x ‖
నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు
యేసయ్యా… నీవే నా ఆరాధ్య దైవమా
యేసయ్యా… నీవే నా ఆధార దీపమా‖ 2x నువ్వు లేని ‖
Verse
పదివేలలో అతి సుందరుడా
కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు
ఎందుకు పనికిరాని వాడనై యుండగా
నీ కుమారునిగా నను స్వీకరించావు‖ 2x అడగాలని ‖
Verse
ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా
ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు
ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు
పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు‖ 2x అడగాలని ‖

Related Tags

WorshipDevotionalJesus