Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nyaayaadhipathi

న్యాయాధిపతి

Nyaayaadhipathi

Lyricist: Kranthi Chepuri
Verse
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన
ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన‖ 2x ‖
ఒక గుంపేమో పరలోకపు గుంపు
రక్షింపబడిన వారికే అది సొంతం
మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం‖ న్యాయాధిపతి ‖
Verse
నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది
కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది‖ 2x ‖
కలువరిలో తన ప్రాణం పెట్టిన
యేసయ్యే నీ ప్రాణ రక్షణ
సిలువలో క్రయ ధనమే చెల్లించిన
ఆ ప్రభువే నీ పాప విమోచన‖ ఒక గుంపేమో ‖
Verse
ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు
ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు‖ 2x ‖
మేఘముపై రానైయున్నాడుగా
త్వరలోనే నిను కొనిపోడానికి
వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
నీ హృదిలో స్వీకరించడానికి‖ ఒక గుంపేమో ‖

Related Tags

Second ComingRepentanceSalvationJudgment