Verse
న్యాయాధిపతి అయిన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవా‖ 2x న్యాయాధిపతి ‖
Verse
ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా‖ 2x ‖
రోగముతో కృశియించగా‖ 2x ‖
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగిన ఏమందువు‖ 2x న్యాయాధిపతి ‖
Verse
గ్రహియించుకో నీదు గమ్యము
విడనాడు పాప గతమును‖ 2x ‖
లేదింక నీకు తరుణము‖ 2x ‖
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో‖ 2x న్యాయాధిపతి ‖