Verse
పల్లవి: న్యాయపీఠము నీ ముందు వున్నది
ధ్యానించిచూడు కూర్చున్న దెవరో
Verse
నీవు నశించుట కోరడు ప్రభువు
ఓపికతో ఆయనే వేచి యున్నాడు
పశ్చాత్తాప పడుమిప్పుడైనా
నిశ్చయ మెరుగు నరకము తప్పదు
Verse
పరీక్షించుకొనుము నీమరణమెప్పుడో
రక్తము ద్వారా ముక్తి పొందితివా
కఠినత్వముతో తృణీకరించిన
న్యాయ త్రాసు ఉన్నది రారాజు చేతిలో
Verse
దాగి యున్న పాపము ప్రభుయేసు చూచెను
అంధకార పాపము తన కంటపడెను
తన దృష్టినుండి తప్పించుకొందువా
తీర్పు కొడవలి తనచేతనుండగ
Verse
అందరికొరకై గ్రంథముల్ తెరువగ
వారి విషయమై వ్రాసిన రీతిన్
దేవ గొర్రెపిల్ల న్యాయము తీర్చును
తన చేతనున్నది తీర్పుకై చేట
Verse
క్రీస్తు యేసునందు శిక్షా విధిలేదు
దీవెనల నొందుచు ఘనత నొందెదరు
ఎల్లప్పుడాయనతోనే యుండెదరు
ప్రభువే నిచ్చును జీవకిరీటము