Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nyayamuga Naduchukoni Prematho Hrudayamu Nimpukoni

న్యాయముగా నడుచుకొని ప్రేమతొ హృదయము నింపుకొని

Nyayamuga Naduchukoni Prematho Hrudayamu Nimpukoni

Lyricist: K Satyaveda Sagar
Verse
న్యాయముగా నడుచుకొని ప్రేమతొ హృదయము నింపుకొని
దీనమనస్సుతొ దేవుని యెదుట దీనునిగా ఉండమని
ఇంతే కదా దేవుడు అడుగు చున్నదీ
బలి ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది
దేవుడు కోరుచున్నది
Verse
ప్రవహించే జలములకు మలినము లేదని
దుప్పికి తెలిసి ఆశపడుతుంది వాగును త్రాగాలని
ప్రవహించే నదిలాంటిది క్రైస్తవ జీవితము
జీవజలమైన వాక్యముతో హృదయము నింపుకొనుము
పాపముతో కలకలు చేసిన ని ప్రయాసము వ్యర్థమూ
కలుగును గాకని పలికిన వెంటనె వెలుగు కలిగెను
నీ ఊపిరి వలన ఆకాశానికి అందము వచ్చెను
అంతరిక్ష మున నీ బలమును దాచిన దేవుడవూ
నా అంతరంగమున పరిశుద్ధతను కోరుచున్నావు
ఘనతా మహిమా పొందుటకు నీవే యోగ్యుడవు
మదిలో పాపము నదిలో మునిగిన పోనే పోదని
విధి నేర్పించి రుధిరము కార్చిన యేసుకు వందనం
గధిలో ప్రార్థన హృదిలో వాక్యము వీధిలో సాక్ష్యము
క్రీస్తును కలిగిన జీవితాల కది ఎంతో అవసరము
వెనకున్నది మరిచి ముందున్న వాటికై సాగి పోవుదమూ

Related Tags

HolinessChristian LifeObedience