Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Bethlehemu Graamamaa Saddhemi

ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమి

O Bethlehemu Graamamaa Saddhemi

Lyricist: Philip Brooks
Verse
ఓ బెత్లెహేము గ్రామమా!
సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై
వెలుంగు తారలు
కానేమి, నిత్యజ్యోతి
జ్వలించు నీతమిన్
పెక్కేండ్ల భీతివాంఛలీ
రాత్రి తీరె నీలోన్.
Verse
మరియకేసుపుట్టెను
నిద్రింప మర్త్యులు
పై గూడి దూతల్వింతయౌ
ప్రేమన్వీక్షింతురు
చాటుడో వేగుచుక్కల్
ఎ శుద్ధజన్మము
దైవానకు నున్నతుల్ భువిన్
శాంతంచు పాడుడీ.
Verse
సద్దేమి లేక వెచ్చగా!
ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై
వరాల్ నరాళికి
నరుండెరుంగకున్నన్
ఎ పాపధాత్రిలో
దీనులంగీకరించిన
యేసుందుజొచ్చును.
Verse
ఓ బెత్లెహేము పావన
వత్సా! మా పై దిగు
పోగొట్టి పాపముల్ మాలో
నీ వేళ పుట్టుము
సువార్త క్రిస్మస్ దూతల్
చెప్పంగ విందుము
మా యొద్ద నుండరమ్ము మా
ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.

Related Tags

ChristmasBethlehem