Verse
ఓ భక్తులారా మనమందరము
నిత్యము యేసుని స్తుతియించెదము
Verse
గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగే మనకు
స్తుతియించెద మేసుని
నూతన అనుభవములను - ఖ్యాతిగా సర్వశక్తుని
Verse
శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
Verse
ఎన్ని శోధనలు భువినున్న
తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో
Verse
శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
Verse
కృంగిన భక్తులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
జయము జయమని ప్రభుకే
యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో