Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Deva Nenu Nee Daapuna Nundedan

ఓ దేవ నేను నీ దాపున నుండెదన్

O Deva Nenu Nee Daapuna Nundedan

Lyricist: Matthayi Samuyelu
Chorus
ఓ దేవ నేను నీ దాపున నుండెదన్ నీ దాపున నుండెదన్ నా దేవ
నను లేపు నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట‖ ఓ దేవ ‖
Verse
బాటసారి లాగు నేఁడు భానుఁడు గ్రుంకి మేటి చీఁకటి గ్రమ్మినన్
నేటి విశ్రాంతికిఁ జోటు బండయైనన్ మాటిమాటికిఁ గలలో సూటిగా
నినుఁదలఁతు‖ ఓ దేవ ‖
Verse
ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ
కూర్మిచే నాకుఁ జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి ననుఁ
బిలువ‖ ఓ దేవ ‖
Verse
నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో
భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేఁగట్టె దను
గర్తా‖ ఓ దేవ ‖
Verse
సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ
జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట‖ ఓ దేవ ‖

Related Tags

WorshipGods Presence