Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Deva Rakshaka Ne Vishwasambutho

ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో

O Deva Rakshaka Ne Vishwasambutho

Lyricist: Ray Palmer
Verse
ఓ దేవ రక్షకా
నే విశ్వాసంబుతో
నిన్ జూతును
నా మొఱ్ఱాలించుము
నా పాప మార్పుము
నన్నింక నీ దరిన్
సదా యుంచు.
Verse
మూర్ఛల్లు నాత్మకు
బలం బొసంగుము
భవత్కృఋపన్
నాకై చావొందిన
నిన్నెల్లకాలము
ఆసక్తి శుద్ధితోఁ
బ్రేమింప నీ.
Verse
నే హాని నొందిన
నన్ జింత క్రమ్మ్రినఁ
గాపాడుము
పోఁగొట్టు చీఁకటి
కన్నీళ్లఁ దుడ్వుము
దొలంగ నీకునన్
నీ సన్నిధి.
Verse
నా యాయు వంతమై
మృత్యూగ్ర బాధలు
నన్నొందుచో
సంశయ భీతులు
తొలగఁ బ్రేమతో
నా దేవ, యాత్మకు
మోక్షం బిమ్ము.

Related Tags

FaithDevotionalPrayer