Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Divyakaanthi Mabbu Kammangaan

ఓ దివ్యకాంతి మబ్బు కమ్మఁగాన

O Divyakaanthi Mabbu Kammangaan

Lyricist: John Henry Newman
Verse
ఓ దివ్యకాంతి, మబ్బు కమ్మఁగా
నన్నడ్పుము
నాయింటి త్రోవ దప్పిపోతిని
నన్నడ్పుము
నాకాళ్ల జారకుండఁ గాచుచు
ఒక్కొక్క మెట్టు భద్ర పర్చుమా
Verse
ఇన్నాళ్లు నేను కోరకుంటిని
నీ శరణు
స్వబుద్ధి నమ్మి తప్పిపోతిని
సదా.
నన్నడ్పుము
గర్వము యేలె నా హృదయము
మన్నించు నా గత జీవితము
Verse
ఇన్నాళ్లుఁ గాచియుంట వింకను
నన్నడ్పుము
నా నష్ట కష్ట దుఃఖ బాధలు
పోఁగొట్టుము
నీవల్ల నేను జయ మొందుచు
నిన్ను స్తుతించి పాడుదున్ సదా

Related Tags

Guidance