Verse
ఓ జగద్రక్షకా విశ్వవిధాత - రక్షణ నొసగితివి
సర్వకృపలకు దాతవు నీవే - బలియైతివి మాకై
Verse
కృపద్వారా రక్షణ మాకొసగె - విశ్వాసము ద్వారానే
అపాత్రులమైనట్టి మాకు - యిది నీ వరమేగా
Verse
పాపములో మేము మరణించినప్పుడు - వచ్చితివి యిలకు
ప్రభువా మేము నీ చెంతనుండ - జీవము నిచ్చితివి
Verse
పాపభారముచే పడిచెడియున్న - మమ్మును గాంచితివి
కృప ద్వారానే మమ్మును పిలిచి శాంతిని వొసగితివి
Verse
రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి
రయముగ విశ్వసించిన మాకు ఆత్మను వొసగితివి
Verse
మరుగైన వాటిని అజ్ఞానులకు బయలుపరచితివి
మర్మములను గ్రహియించుటకు జ్ఞానము నొసగితివి
Verse
సేవను మాకు నిచ్చితివయ్యా యుగయుగముల వరకు
శక్తిమంతులమై నిను స్తుతియింప విజయము నొసగితివి