Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Kraisthava Yuvakaa

ఓ క్రైస్తవ యువకా

O Kraisthava Yuvakaa

Lyricist: Bontha Samuyelu
Verse
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా‖ 2x ‖
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే‖ ఓ క్రైస్తవ ‖
Verse
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా‖ 2x ‖
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా‖ ఓ క్రైస్తవ ‖
Verse
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా‖ 2x ‖
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా‖ ఓ క్రైస్తవ ‖
Verse
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా‖ 2x ‖
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా‖ ఓ క్రైస్తవ ‖