Verse
ఓ క్రీస్తు భక్తులారా
నీతి నిమిత్తము
పోరాడ కవచంబు
ను ధరించుడి
శక్తుండు సైన్య ప్రభు
వు, శాంతిరాజుకు
అపారసేవ జేయ
అర్పణ యైతిమి.
జోహారు, రక్షకుండ!‖ జోహారు ‖
నీ మార్గమందున
విజయగృహ దైవ
పురంబు బోదుము
Verse
పదండి ముందుకంచు
నాదంబు చేయుడు
స్వార్థంబు గెల్వవలె
సాగిపోదము
హర్షంబులేని యాత్మ
లెన్నెన్నొ చూడుడు
ఈ ఘోరయుద్ధమున
కందరి గూర్చుడు.
Verse
క్రీస్తే మా నాయకుండు
అటంచు దెల్పగ
మా హృదయంబునందు
సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు
సిల్వధ్వజము!
ఈ లోకమేలులన్ని
దీవెన నొందును.