Verse
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
Chorus
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము‖ 2x ఓ క్రీస్తు ‖
Verse
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము‖ 2x ‖
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ‖ 2x ప్రతి కష్టము ‖
Verse
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు‖ 2x ‖
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి‖ 2x ప్రతి కష్టము ‖
Verse
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు‖ 2x ‖
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు‖ 2x ప్రతి కష్టము ‖