Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Maa Thandri Needu Naamamu Nithya Ma

ఓ మా తండ్రి నీదు నామము నిత్య మ

O Maa Thandri Needu Naamamu Nithya Ma

Lyricist: William Daanan
Chorus
ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్ను చుండు గాక సకల లోకము
క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై
వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య‖ ఓ మా తండ్రి ‖
Verse
నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే
రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను
ధర్మ మూర్తి సత్యవర్తి‖ ఓ మా తండ్రి ‖
Verse
నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి
మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప
నీవె మాకు వేరె లేరు సుమ్ము‖ ఓ మా తండ్రి ‖
Verse
మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము
నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే
మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్‖ ఓ మా తండ్రి ‖

Related Tags

WorshipPrayer