Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Maanavaa

ఓ మానవా

O Maanavaa

Lyricist: Kranthi Chepuri
Verse
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని‖ 2x ‖
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు‖ 2x ‖
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం‖ 2x ‖
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి?‖ 2x ఓ మానవా ‖
Verse
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా‖ 2x ఈ దినమే ‖
Verse
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా‖ 2x ఈ దినమే ‖
Verse
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే‖ 2x ఈ దినమే ‖

Related Tags

GospelRepentanceSalvation