Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Maanavaa Nee Paapam Maanavaa

ఓ మానవా నీ పాపం మానవా

O Maanavaa Nee Paapam Maanavaa

Chorus
ఓ మానవా నీ పాపం మానవా‖ ఓ మానవా ‖
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా‖ 2x ‖
Verse
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము‖ ఓ మానవా ‖
పాపములోనే మరణించినచో తప్పదు మరణము‖ 2x ‖
Verse
ఎంతకాలము పాపములోన బ్రతుకుచుందువు‖ ఓ మానవా ‖
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు‖ ఓ మానవా ‖
ఎంతకాలము దుఖ:ములో మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము‖ ఓ మానవా ‖
యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును‖ 2x ఓ మానవా ‖
Verse
ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు‖ ఓ మానవా ‖
ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు‖ ఓ మానవా ‖
ఎంతకాలము దేవుని నీవు దు:ఖపరతువు
యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను‖ ఓ మానవా ‖
యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును‖ 2x ఓ మానవా ‖

Related Tags

GospelRepentanceSalvation