Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Maanavudaa Melukonumu Nidurayelaraa

ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా

O Maanavudaa Melukonumu Nidurayelaraa

Verse
ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా
ప్రభుయేసు వచ్చు సమయమాయె తేరిచూడరా
నేడే తేరిచూడరా
Verse
ఏ బేధమే లేక జన్మకర్మ పాపులం - అందరం పాపులం
ఆ పాప శిక్ష ఘోరమైన మరణమేగదా - అగ్నిగుండమేగదా
ఆ మరణమును జయుంచి క్రీస్తు తిరిగి లేచెను
నిత్యజీవమిచ్చెను
Verse
రక్తమంతయు చెడిపోయు హీనులైతిమి - శక్తి హీనులైతిమి
భక్తి శూన్యమై భంగపడి భ్రష్టులైతిమి - బహు దుష్టులైతిమి
యుక్తకాలమందు కలువరిలో రక్తమిచ్చెను
ముక్తిబాట చూపెను

Related Tags

Second ComingRepentanceSalvation