Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Naa Hrudayamaa Paadumaa Krottha Geetham Prabhunake

ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే

O Naa Hrudayamaa Paadumaa Krottha Geetham Prabhunake

Chorus
ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ
హృదయమా పాడుమా
Verse
క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది
భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను
హృదయమా పాడుమా
Verse
క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను
విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను
హృదయమా పాడుమా
Verse
క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ
కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను
హృదయమా పాడుమా
Verse
క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే
క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె
హృదయమా పాడుమా
Verse
క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు
క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను
హృదయమా పాడుమా

Related Tags

PraiseWorshipPsalm