Verse 1
Reference: రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తన Psalm 145
Chorus
ఓ నాదు యేసురాజా - నిన్ను నే నుతించెదను
Verse
నీనామమును సదా - నే సన్నుతించుచుందును
Verse
అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను
Verse
వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్
Verse
రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను
Verse
విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును
Verse
నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను