Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Naavikaa

ఓ నావికా

O Naavikaa

Lyricist: Joshua Shaik
Verse 1
ఓ నావికా.. ఓ నావికా..
ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా..
Verse 2
ఓ నావికా…. ఓ నావికా….
శ్రమలలో శ్రామికా…‖ 2x ‖
ఊసు వింటివా వింత గంటివా
యేసు సామి ఊసు నీవు వింటివా‖ 2x ‖
హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సా‖ 2x ‖
Verse
వలేసావు రాతిరంతా
ధార పోసావు కష్టమంతా‖ 2x ‖
చిక్కలేదు చేప ఒక్కటైనా
దక్కలేదు ఫలము కొంతైనా‖ 2x ‖
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా‖ 2x ‖
నింపాడు నీ నావ అద్భుత రీతితో
తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో‖ 2x ‖
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి‖ 2x ‖
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి‖ 2x ఓ నావికా ‖
Verse
విరిగి నలిగిన మనస్సుతో
చేసావు నీ సమరం‖ 2x ‖
శయనించక ఎడతెగక
ఈదావు ఈ భవ సాగరం‖ 2x ‖
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా‖ 2x ‖
కరుణించాడు నిన్ను చల్లని చూపుతో
నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో‖ 2x ‖
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి‖ 2x ‖
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి‖ 2x ఓ నావికా ‖

Related Tags

EncouragementHopeFishermen