Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Nestama E Subhavarta Teliyuna

ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా

O Nestama E Subhavarta Teliyuna

Verse
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా‖ 2x ‖
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా‖ 2x ‖
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా‖ 2x ‖
Verse
నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన‖ 2x ‖
ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా‖ 2x ‖
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా
Verse
నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కిన
నీకున్న స్వాస్ధ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా‖ 2x ‖
ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా‖ 2x ‖
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా
నీ స్థితిమార్చువాడు యేసయ్యానని సత్యం తెలియునా

Related Tags

ComfortGospelEvangelism