Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Pendli Varuda O Pendli Vadhuva

ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా

O Pendli Varuda O Pendli Vadhuva

Verse
ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా
అననీయ సప్పీరా వంటి భార్యాభర్తలుగా
ఎన్నడూనూ ఉండరాదు
అకులా ప్రిస్కిల్లావంటి భార్యాభర్తలుగా
బ్రతుకాలి ప్రభువుకై
Verse
మనసులో మోసాన్ని బుద్దిలో అబద్ధాన్ని
దాచాడు అననీయ తన భార్య సప్పేరాతో
ధనానికి వారు దాసులైనారు
పాపాన్ని చేసి నష్టపోయినారు
Verse
ఆదర్శప్రాయమైనది అకులా ప్రిస్కిల్లా జంట
ఆ భార్యాభర్తతో కలిసి అ భర్త భార్యతో కలసి
ఏకభావముతో ఏకాత్మతోను
పరిచర్య చేసిన విశ్వాసి వీరులు

Related Tags

Christian LifeMarriage