Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Prabhunda Nin Nutheemchuchunnaamu Vinayamuthoada

ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ

O Prabhunda Nin Nutheemchuchunnaamu Vinayamuthoada

Lyricist: Mallela David
Verse
ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ
మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు‖ మో ‖
Verse
నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు
సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్
నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు‖ ఓ ‖
Verse
పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా
ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు‖ నో ‖
Verse
కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా
సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు
కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు‖ నో ‖
Verse
మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల
మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్‖ ఓ ‖
Verse
నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను
గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట
బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే‖ ఓ ‖
Verse
నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు
నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము
పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే‖ ఓ ‖
Verse
నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము
వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్‖ ఓ ‖
Verse
నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ
బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్‖ ఓ ‖
Verse
ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము
మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్‖ ఓ ‖
Verse
ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు
శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము‖ ఓ ‖

Related Tags

PraiseWorship