Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Prabhuva Nee Sevan Cheseda Nityamu

ఓ ప్రభువా నీ సేవన్ చేసెద నిత్యము

O Prabhuva Nee Sevan Cheseda Nityamu

Chorus
ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము‖ 2x ‖
నీ మాటే వినెద - నరుని మాట వినకుందు‖ 2x ‖
Verse
శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములు
పైబడుచునున్నవి - బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము
Verse
బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తం
ప్రోక్షించు నాపైన - నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము
Verse
లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములు
బెదిరించుచున్నవి - ఆకాశము నుండి - ఆదరించుము నన్ను
Verse
బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం
దినదినము నేర్పించు - నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా
Verse
మెల్లని నీ స్వరమున్ - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్
నా కొరకు చూపించు - నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు
Verse
పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్
ప్రభునింపు నీ కొరకే - పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు
Verse
క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము
క్రీస్తే నా ఆశ్రయము - క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము

Related Tags

WorshipDevotionService