Verse
ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము
విరిగిన మనస్సుతో నే వేడెదను
Verse
కోల్పోయితిని మొదటి ప్రేమను
చల్లారిపోయె నీ ప్రేమ నాలో
నాలో నిలుపుము నీదు ప్రేమ
Verse
పడినవారి యాశ్రయమా
విడువ బడిన వారి సహాయుండా
గాయపు చేతితో లేపుమా
Verse
శత్రుని యురిలో చిక్కియున్నాను
నాదు బంధకమును తెంపుము నీవు
ఆనందము నిమ్ము మరల నాకు
Verse
దోషిని నేను నీకు సఖులకు
అడుగుచుంటిని మన్నన మిమ్ము
కడుగుము నీదు రక్తములోన
Verse
ఐక్యతయే నా యభిలాష
నాదు చేదును తొలగించుము
శత్రుని శక్తిని ఓడించుము
Verse
పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా
వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము
బూడిద చేయుము నాలోని మన్షున్
Verse
ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున
కదలింపగ వ్యాపింప జేయుము
హృదయమును ఫలియింప చేయుము