Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Prabhuvaa Ne Daari Tholagithi Nee Sharanu Jochithini

ఓ ప్రభువా నే దారి తొలగితి నీ శరణు జొచ్చితిని

O Prabhuvaa Ne Daari Tholagithi Nee Sharanu Jochithini

Verse
ఓ ప్రభువా నే దారి తొలగితి
నీ శరణు జొచ్చితిని - నీ ప్రేమను పొందితిని
Verse
నా పాపముల నే నొప్పుకొని
పశ్చాత్తాప పడితిని - పాపక్షమాపణ కలిగె
Verse
ప్రభుయేసు నీ రక్తము ద్వార
ప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను
Verse
నీ రక్తముతో నామది కడిగి
పాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి
Verse
నీ రక్తముచే పాపము తొలగె
రక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె
Verse
నీ రక్తముచే నా శిక్ష తొలగె
బంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి
Verse
నీరక్తముచే సహవాసమును
పరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి

Related Tags

GraceRepentanceSalvationForgiveness