Verse
ఓ ప్రభువా యిది నీ కృపయే - గొప్ప క్రయము ద్వారా కలిగె
Verse
కృపద్వారానే పాపక్షమాపణ - రక్తము ద్వారానే కలిగె
అపరాధముల నుండి విమోచన - యేసులో మనకు ప్రాప్తించె
Verse
కృపద్వారానే కలిగిన రక్షణ - మానవులొసగ జాలరిల
క్రియలద్వారా కలుగలేదు - యేసు ప్రభుని వరమిదియే
Verse
కృపతో మనల పిలిచెను ప్రభువు - పరిశుద్ద పిలుపుద్వారా
అపరిమిత సంకల్పమువలన - మనమెరిగితిమి ఈ ధరలో
Verse
కృపద్వారానే నీతి మంతులుగా - తీర్చెను మనల ఉచితముగ
అపాత్రులమైయున్న మనకు - ప్రాయశ్చిత్తము కలిగెనుగ
Verse
కృపయే మనకు బయలు పడెను - సమస్తమును భోధించును
అపవిత్ర క్రియలన్నియు విడచి - భయభక్తులతో బ్రతికెదము
Verse
కృపద్వారానే బలవంతులమై - ఎదురుకొనెదము యుద్ధమును
ప్రభువునందు అంత మువరకు - స్థిరముగ ముందుకుసాగెదము
Verse
కృపద్వారానే సమీపించితిమి - దానియందే నిలిచితిమి
క్రీస్తు మహిమ నిరీక్షణకై - ఆయనకే స్తుతి పాడెదము