Chorus
ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి
Verse
దారి తప్పిన నన్నును నీవు వెదకివచ్చి రక్షించితివి
నిత్య జీవం నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి
Verse
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడు చేయివిడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి
Verse
ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి