Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Prarthana Su Prarthana Nee Prabhavambun Marathuna

ఓ ప్రార్థనా సు ప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా

O Prarthana Su Prarthana Nee Prabhavambun Marathuna

Verse
ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖాముఖిన్ - నేబ్రణుతింతు నీ ప్రభున్
నా ప్రాణమౌ సు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా - నీ‖ నీ ‖
Verse
పిశాచి నన్ను యుక్తితో - వశంబుచేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
నాశోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా - నా శోక‖ నా శోక ‖
Verse
నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను
నా దేవుడేసు చెంతకు - మోదంబు గాంచుబోవును
సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ
నా ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్థన - నా ధైర్య‖ నా ధైర్య ‖
Verse
అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం
బురంగుగాను నెక్కి నా - చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - బరే శు ధ్యాన ప్రార్థనా - కరంబు‖ కరంబు ‖

Related Tags

DevotionalPrayer