Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Prarthana Suprarthana

ఓ ప్రార్థనా సుప్రార్థనా

O Prarthana Suprarthana

Lyricist: William Walford
Verse
ఓ ప్రార్థనా సుప్రార్థనా
నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నేఁ బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సు ప్రార్థనా
నీ ప్రేరణంబుచేఁ గదా
నీ ప్రేమధారఁ గ్రోలుదు
నో ప్రార్థనా సుప్రార్థనా.
Verse
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయఁ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమన ప్రార్థనా
నా శోక మెల్లఁ దీర్చెడు
విశేషమైన ప్రార్థనా.
Verse
నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖభార మెల్లను
నా దేవుఁ డేసు చెంతకు
మోదంబుఁ గొంచుఁబోవును
సదా శుభంబు లొందను
విధంబుఁ జూప నీవెగా
నా ధైర్యమిచ్చు ప్రార్థనా
సుధా సుధార ప్రార్థనా
Verse
అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిరగృహంబుఁ జూతును
శరీరమున్ విదల్చి నేఁ
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్థనా.

Related Tags

DevotionalPrayer