Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Premagala Yesu Preminchinaavu Mammu

ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము

O Premagala Yesu Preminchinaavu Mammu

Verse
ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు
Verse
అద్భుత యాగమందు - అందరికై బలియై
అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి
Verse
దాసులమై మేముండ - మోషేను పంపితివి
చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ
Verse
క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము
యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి
Verse
ఎడారి అడవిలోన - ఊటల నదులు నడిపి
ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్
Verse
బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు
బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు
Verse
సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు
సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె
Verse
మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్ని
ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు

Related Tags

WorshipSalvationJesus