Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Priya Yuvaka Nammaku Ni Yauvvanam

ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం

O Priya Yuvaka Nammaku Ni Yauvvanam

Verse
ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం
దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
ఓ ప్రియ యువతీ నమ్ముకు నీ యౌవ్వనం
దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
Verse
నీ యౌవ్వనము అశాశ్వతం నీ సౌందర్యము వాడిపోవును
నీ ఆయుష్షు తరిగిపోవును నీ బలమంతయు క్షీణించును
Verse
యేసే నీకు శాశ్వతము వాక్యమే నీకు దీపము
ప్రార్ధనే నీకు ఆయుధము సౌక్ష్య జీవితమే నీ బలము
Verse
యౌవ్వన ఆశలకు లొంగకు సాతాను వలలో చిక్కకు
యేసుని చెంతకు చేరుము నిత్య రాజ్యమును పొందుము

Related Tags

YouthWisdomGodly Living