Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Sadbhakthulaaraa Loakarakshakumdu

ఓ సద్భక్తులారా లోకరక్షకుండు

O Sadbhakthulaaraa Loakarakshakumdu

Lyricist: Frederick Oakeley
Verse
ఓ సద్భక్తులారా !
లోకరక్షకుండు
బెత్లెహేమందు నేఁడు జన్మించెన్
రాజాధిరాజు
ప్రభువైన యేసు
నమస్కరింప రండి‖ 3x ‖
Verse
సర్వేశ్వరుండు
నరరూప మెత్తి
కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్
మానవ జన్మ
మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి‖ 3x ‖
Verse
ఓ దూతలారా!
ఉత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుఁడి
పరాత్పరుండా
నీకు స్తోత్ర మంచు
నమస్కరింప రండి‖ 3x ‖
Verse
యేసూ! ధ్యానించి
నీ పవిత్ర జన్మ
మీ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య
మాయె నరరూపు
నమస్కరింప రండి‖ 3x ‖

Related Tags

WorshipChristmasNativity