Verse
ఓ సద్భాక్తులారా లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
Verse
సర్వేశ్వరుండు నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
Verse
ఓ దూతలారా ఉత్సాహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
Verse
యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ
ఈ వేల స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయే నర రూప
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో