Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Sadbhaktulara Lokarakshakumdu

ఓ సద్భక్తులారా లోకరక్షకుండు

O Sadbhaktulara Lokarakshakumdu

Verse
ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు
బెత్లెహేమందు నేఁడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
Verse
సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
Verse
ఓ దూతలారా! ఉత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుఁడి
పరాత్పరుండా నీకు స్తొత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
Verse
యేసూ! ధ్యానించి నీ పవిత్రజన్మ
మీవేళ స్తొత్రము నర్పింతుము
అనాదివాక్య మాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో

Related Tags

WorshipChristmasNativity