Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Sanghamaa Shubhavartha Yide Prabhuyesu Vacchuchunde

ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె

O Sanghamaa Shubhavartha Yide Prabhuyesu Vacchuchunde

Verse
ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె
ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె
Chorus
చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె
నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె
Verse
లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె
కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను
Verse
ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె
ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా
Verse
జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు
తరుణమునందు శుద్ధి పొందినచో కరుణను గాంచలేవు

Related Tags

Second ComingRepentanceEnd Times