Chorus
ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా
సర్వదా నిను నే స్మరియింతును
Verse
ఆనందమే మహాదానందమే
ఆశ్చర్యకరుడు యేసుండు
నా పాపముల క్షమియించెను
Verse
చెరనుండి నేను - మొరపెట్టగా
పరమునుండి - ఉత్తర మిచ్చెను
Verse
గూఢమైన - సంగతులన్
గ్రహించునట్లు - ప్రభుచేయును
Verse
అడుగువాటికన్న - ప్రభువు
అత్యధికముగా - దయచేయును
Verse
ఊహకు మించిన - కార్యములన్
మహాప్రభు నడిగిన - నెర వేర్చును
Verse
వేడుకొనక - మునుపే ప్రభు
వడిగా మాకు - త్తరమిచ్చును
Verse
మునుపటికన్న - అధికముగా
మేలుల - మాకు - కలుగజేయున్
Verse
ప్రార్థనకు - ప్రతిఫలముల్
ప్రియముగ నొసగును - హల్లెలూయ‖ హల్లెలూయ ‖