Verse
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను
ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు
ప్రేయసికన్న ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు‖ 2x ‖
Verse
కాలాలు మారిన కరిగిపోని ప్రేమ
కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ‖ 2x ‖
ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ‖ 2x ‖
తల్లియైన మరచున నిను మరువని ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ
Verse
పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ
పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ‖ 2x ‖
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ‖ 2x ‖
పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ