Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Yaathrikudaa

ఓ యాత్రికుడా

O Yaathrikudaa

Lyricist: Victor Rampogu
Verse
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా
బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..
ఓ బాటసారి ఓహో బాటసారి
జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది
నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది‖ 2x ‖
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం‖ 2x ఓ యాత్రికుడా ‖
Verse
పుట్టగానే తొట్టెలో వేస్తారు
గిట్టగానే పెట్టెలో మూస్తారు
జాగు చేయక కాటికి మోస్తారు
ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ..‖ 2x ‖
బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే‖ 2x ‖
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం‖ 2x ఓ యాత్రికుడా ‖
Verse
ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు
ఏడిపిస్తూ సమాధికి పోతావు
కూడబెట్టినవి మోసుకు పోలేవు
ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ..‖ 2x ‖
జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే‖ 2x ‖
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం‖ 2x ఓ యాత్రికుడా ‖
Verse
మరణము ఒక నిద్ర యేసునందు
అంతము అది కాదు క్రీస్తునందు
మృతులు లేచుట స్థిరము యేసునందు
నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ..‖ 2x ‖
నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము‖ 2x ‖
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం‖ 2x ఓ యాత్రికుడా ‖

Related Tags

GospelSalvationDeathLife Journey