Verse
ఓ యేసు భక్తులారా,
మీ రాజు ధ్వజము
గ్రహించి సాహసించి
పోరాడి గెల్వుఁడీ
విశ్వాసులార, రండి
మీ రక్షణార్థమై
ప్రయాసపడ్డ యేసు
విజయ మిచ్చును.
Verse
మీయం దసూయఁ బట్టి
మీ యాత్మ నాశము
నెన్నండుఁ గోరునట్టి
యనేకు లుందురు
మీ రెల్ల రేసు పేరు
వచించి యాయనే
సర్వాధికారి యంచు
సేవింపవలెను.
Verse
ప్రచండ మైన దండు
పోరాడ లేచినన్
విరోధి శక్తి కొద్ది
మరీ తెగించుఁడీ
స్వకీయ శక్తిఁగాక
శ్రీ యేసు నామమున్
స్మరించి వానియందు
విశ్వాస ముంచుండీ.