Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Yehova Neeve Nannu Shodhinchi Yerigithivi

ఓ యెహోవా నీవే నన్ను శోధించి యెరిగితివి

O Yehova Neeve Nannu Shodhinchi Yerigithivi

Verse
ఓ యెహోవా నీవే నన్ను - శోధించి యెరిగితివి
Verse
నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును
నా తలంపులు నీకు తెలిసెన్ నాలో కలుగక పూర్వమే
Verse
నాదు నడక, నాదు పడక నీవే పరిశోధింతువు
నా ప్రవర్తన యంతా నీకే సంపూర్ణముగా తెలియును
Verse
నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి
నీదు యెడమ కుడిచేతులలో నన్ను భద్రపరతువు
Verse
నీదు యాత్మకు మరుగైయిలలో నెచ్చటికి నే వెళ్ళెదన్
యెక్కడికి వెళ్ళినను అక్కడున్నావు ప్రభూ
Verse
నాదు అంతరంగమును నాదు ఆలోచనలను
నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయమున్

Related Tags

WorshipPrayerPsalm