Verse
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది‖ 2x ఓ యేసు ‖
Verse
అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు‖ 2x ఓ యేసు ‖
Verse
సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి‖ 2x ఓ యేసు ‖
Verse
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు‖ 2x ఓ యేసు ‖
Verse
దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్‖ 2x ఓ యేసు ‖