Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Yesu Nee Prema Entho Mahaneeyamu

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము

O Yesu Nee Prema Entho Mahaneeyamu

Chorus
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము
ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది
Verse
ఆగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి
ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు‖ ఓ యేసు ‖
Verse
సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు
నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి
నా మొర్రకుముందె తోడనుందునంటివీ‖ 2x ఓ యేసు ‖
Verse
మరణాంధకారపు లోయనే సంచరించన
నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి
నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు‖ 2x ఓ యేసు ‖
Verse
కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక
బయలులో పరుండజేయును భోజన జలములతో
తృప్తిపరచును నాతో నుండు నేను‖ 2x ఓ యేసు ‖
Verse
దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ
హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు
యోగ్యుడేసు హల్లెలూ ఆమేన్‖ 2x ఓ యేసు ‖

Related Tags

PraiseWorshipJesus Love