Verse
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది
Verse
అగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
Verse
సంకట సమయములో - సాగలేకున్నాము
దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి
Verse
మరణాంధ కారంపు లోయలో నేసంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు
Verse
కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తిపరచును - నాతో నుండు నేసు
Verse
దేవుని గృహములో సదా స్తుతించెదను
నంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్