Verse
ఓ యేసు, రక్షకా
నీ పిల్పు విందును
కల్వరి పై నా పాపము
నివృత్తి చేసితి.‖ యేసు ‖
Chorus
యేసు, వచ్చెదన్
నన్ను ఁ జేర్చుము
నన్ నీ రక్తమందున
పవిత్ర పర్చుము
Verse
నేనైతే పాపిని
నీవే నా ప్రాపపు
నా దోష మెల్ల కడిగి
పవిత్రపర్చుము
Verse
అశక్తుఁ డనౌ నన్
నీవే స్థాపించుము
విశ్వాస ధైర్య బలముల్
నాలో ఁ బుట్టించుము