Verse
ఓ యువతీ యువకా - ఓ యవ్వనుండా
యేసుని సిలువ గురుతుందా - యేసుని సిలువ యెరుకుందా
Verse
దనవంతుడేసు దయనెంచి నీపై - దరిద్రుడాయేను గురుతుందా
దాసుని రూపము దోషంబునెంచక - దోసిలొగ్గెను యెరుకుందా‖ ఓ ‖
Verse
కత్తులు గుదియలు ఎదనుంచి యూదులు - ఎదిరించిరేసుని గురుతుందా
బందించిరేసుని దొంగనుబోలి - దూషించి ఉమివేసిరెరుకుందా‖ ఓ ‖
Verse
శిరమునందు ముండ్లను నాటి - శిలువను మోపిరి గురుతుందా
వీదుల వెంట వేధించిరేసుని - ఎరయాయె కొరడాలకెదురుందా‖ ఓ ‖
Verse
మిట్ట మధ్యాహ్నము కల్వరి గుట్టపై - కొట్టబడె శిలువను గురుతుందా
చట్టుబండపై యవ్వన రక్తము - వరదవలె ప్రవహించెరెరుకుందా‖ ఓ ‖
Verse
ఏలీ ఏలీ లామా సబక్తాని - ఎలుగెత్తి అరిచేను గురుతుందా
బండలు పగుల, కొండలు కదల - బలియాయె ప్రభు యేసు తెలిసిందా‖ ఓ ‖
Verse
యవ్వనమందే కాడిని మోయుట - నరునికి మేలని యెరుకుందా
యవ్వనమందే యేసుని నమ్మి - సిలువను మోయుట తెలిసిందా‖ ఓ ‖