Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Odduchaeri Nee Yedhuta Nilchunapdu Rakshaka

ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా

Odduchaeri Nee Yedhuta Nilchunapdu Rakshaka

Verse
ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?
Chorus
ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?
Verse
ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు
Verse
యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే
Verse
కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?
Verse
భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ

Related Tags

RepentanceEvangelismSoul Winning