Verse
ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమా
నీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగా
ఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెను
జీవంపు భోజనము నీలోను తిందుము
Verse
సీయోను కొండపైన దూతాళి భక్తులు
ఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచు
ఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతో
శ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో‖ అహో ‖
Verse
విముక్తులైనవారు - శ్రీ యేసుతోడున
జయంబు గొన్నవారు - నిత్యంబు నందున
శ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులై
కీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై
Verse
ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమా
భక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదా
ఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుము
ఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు