Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ohoho Maa Yannalaaraa Yudhyogimpanda

ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండ

Ohoho Maa Yannalaaraa Yudhyogimpanda

Lyricist: Purushothamu Choudari
Verse
ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి
యనుచుఁ క్రీస్తుని దయను గోరండి‖ ఓహో ‖
Verse
అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ
బోకమునుపే ప్రభువును వేడండి‖ ఓహో ‖
Verse
మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట
వీను సింహాసనము నంటి కూర్చుండు‖ ఓహో ‖
Verse
అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల
రక్త వర్ణము నొందును‖ ఓహో ‖
Verse
కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము
తాపమున కరిగి పోవుచుండున్‖ ఓహో ‖
Verse
నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే
తెరువు పాపా త్ములకు గలుగును‖ ఓహో ‖
Verse
ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా
దినమందున దిరమై యట నిలువంగలర‖ ఓహో ‖
Verse
కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి
గద పెక్కు విధములను‖ ఓహో ‖
Verse
కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ
చేయుచుంటిరే‖ ఓహో ‖
Verse
ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు
ప్రభువున కెఱుక సంపూర్ణముగాను‖ ఓహో ‖
Verse
జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు
మాత్రమె విచా రించు ప్రభువతఁడు‖ ఓహో ‖

Related Tags

RepentanceEnd Times